ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2023, 04:25 PM

సీఎం జగన్ కరువుకు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి  ఎద్దేవ చేశారు. శనివారం నాడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం కలుగోట్లలో ఎల్ఎల్సీ కాలువ ఆయకట్టు కింద నీళ్లు అందక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ఎల్సీ కాలువ నీటిని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన పొలాలకు మళ్లించు కుంటున్నారని దీనివల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌రెడ్డి రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com