టీడీపీ, జనసేన పార్టీల మరోసారి భేటీ కావాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 9న విజయవాడ వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ భేటీకి పవన్, నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ నుంచి నారా లోకేశ్, యనమల రామకృష్ణుడుతోపాటు ఇతర నేతలు పాల్గొననున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.