విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. నవంబరు 6 నుంచి 12వ తేదీ వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి- విశాఖ (07466) మెమూ, విశాఖ- రాజమండ్రి (07467) మెమూ రద్దయ్యిందని చెప్పారు. అలాగే, ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. అలాగే, దీపావళి పండగ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటం వల్ల చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- భువనేశ్వర్ (06073) ప్రత్యేక రైలు నవంబరు 13, 20, 27 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మర్నాడు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అనంతరం 11.20 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు భునేశ్వర్‌కు చేరుకుంటుందని అన్నారు. భువనేశ్వర్- చెన్నై సెంట్రల్ (06074) ప్రత్యేక రైలు నవంబరు 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుందని వివరించారు.
అలాగే, సూరత్-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు నవంబరు 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20గంటలకు సూరత్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర-సూరత్ (09070) ప్రత్యేక రైలు నవంబరు 10, 17, 24, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి.. ఉదయం 7.10గంటలకు పెందుర్తికి, 8.20గంటలకు దువ్వాడకు చేరుకుంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa