వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును కింగ్ విరాట్ కోహ్లి ఈరోజు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సాధించాడు. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా, కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు సాధించాడు. తన పుట్టినరోజున ఈ రికార్డును సాధించడం కోహ్లీ కెరీర్‌లో ఒక మధురమైన క్షణాన్ని కూడా తెలియజేసింది. ఈ జాబితాలో సచిన్, కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఇంకా 31 సెంచరీలతో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa