కొండవీడుకోటలో చారిత్రక, సాంస్కృతిక సమాచారాన్ని తెలియజేస్తూ, కోటలో నడిబొడ్డున గ్యాలరీ ఏర్పాటును ఆదివారం బట్టి ప్రోలయ వేమారెడ్డి ప్రారంభించారు. ఈ గ్యాలరీలో క్రీస్తుశకం 13వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకూ చారిత్రక పరిణామాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కోటను క్రీస్తుశకం 1325 నుంచి 1424 వరకూ కొండవీడును రెడ్డిరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారని వారు తెలిపారు.