రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే రైతులను ఆదుకోవడంలో దృష్టి పెట్టకుండా సిఎం జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి. జగదీష్ విమర్శించారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని బిటి పక్కీరప్ప భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆయన చేశారు.