విజయవాడ బస్టాండ్లో జరిగిన ప్రమాదం బాధాకరం అని నారా లోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 'ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు..నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదు' అని అయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.