ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో త్రొక్కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2023, 01:04 PM

 రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితు లకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు. వైసీపీ పాలనలో ఆరువేల మంది దళితులు, ఎస్టీలపై దాడులు జరిగాయని, పోలీసులు కూడా దళితులపై పైశా చికంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలాకాలో దళిత నాయకుడు, టీడీపీ కార్యదర్శి శ్యామలరావుపై అమానుషంగా వ్యహరిం చడం దారుణమన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బెవర రాము, శిమ్మ చంద్రశేఖర్‌, కింజరాపు రామారావు, పీస కృష్ణ, బోయన సతీష్‌, బెవర శివ కుమార్‌, సరియపల్లి మధు, వెలమల శిమ్మన్న, చలపాక మల్లేసు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com