రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు, హత్యలు, మానభంగాలు పెరిగి పోయాయని టీడీపీ నేత పీఎంజే బాబు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారంపేట వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఎస్సీలు భయంతో బతుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణ వెంకటరావు, కొర్లకోట రామారావు, సూర్యప్రకాష్ దొర తదితరులు పాల్గొన్నారు.