కేంద్ర సమాచార హక్కు కమిషన్ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. గత నెల 3న వైకే సిన్హా పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్‌గా నియమితులైన తొలి దళితుడిగా హీరాలాల్ సమారియా కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa