పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం 9వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి సమావేశం 7న జరగాల్సి ఉంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకొని ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై ముసాయితా నివేదికను కమిటీ పరిశీలించి, ఆమోదించనున్నది. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ ఈ నెల 2న సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.