ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం తొలి దశలో పోలింగ్ జరగనుంది, వీటిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్ పరిధిలో ఉన్నాయి. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పరిశీలిస్తున్నారు. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు.