భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్ల్ వాంగ్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. భారత్, భూటాన్ మధ్య సంబంధాలపై వారు చర్చించినట్లు సమాచారం. భారత్, భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదం, పలు వాణిజ్య ఒప్పందాలపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. భారత్, భూటాన్ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం.