మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి ఎస్సీ కాలనీలో 30 సంవత్సరాలుగా ఉంటున్న తమ ఇంటిని కార్పొరేటర్ రమేశ్ కూలగొడతానని దౌర్జన్యం చేస్తున్నాడని మేరుగు నిర్మలకుమారి అవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్లో స్పందన లో భాగంగా గోడు వెళ్లబోసుకుంది. కార్పొరేటర్ ఇటీవల గూండాలను ఇంటికి పంపి మరుగుదొడిడని పడగొట్టించాడని ఆరోపించింది. ఖాళీచేసి వెళ్లకపోతే ఇంటిని కూల్చి వేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.