బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై విజయసాయి రెడ్డికి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాకి తెరలేపారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీకి, వైసీపీ మద్దతు ఇవ్వలేదా.. వైసీపీ బీజేపీ వైపు ఉందాలేదా తేల్చాలి. సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో వచ్చిన నిధులు నాడు నేడుతో దుర్వినియోగం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వట్లేదు. ఎర్రచందనాన్ని ఇష్టానుసారంగా దోచుకున్నారు. స్టిక్కర్ కింగ్, లిక్కర్ కింగ్ సీఎం జగన్పై దాడి కోడికత్తి కేసు పెద్ద డ్రామా కాదా.. చంద్రబాబు బెయిల్పై మాట్లాడితే టీడీపీ వాళ్లు అని ఆపాదిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వం చాలా బెటర్ అని ఆది నారాయణరెడ్డి సెటైర్లు వేశారు.