వైసీపీ నేతల దుర్మార్గాలకు వలంటీర్లు కూడా బలవుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ మహిళ వలంటీర్‌పై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. బాధిత వలంటీర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే.. సామాన్య మహిళలకు జగన్ పాలనలో రక్షణ లేదని స్పష్టం అవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు.