ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 01:36 PM

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సీపీఐ, టీడీపీ నేతల అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. సీఎం జగన్ పుట్టపర్తి పర్యటన సందర్భంగా కరువు సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. కరువు సమస్యపై మాట్లాడేందుకు కూడా జగన్‌కు తీరిక లేదా? అని నిలదీశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com