తిరుమల తిరుపతి దేవస్థానలో పార్వేటి మండపం కూల్చేవేయాలని నిర్ణయం తీసుకోవడంపై టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపామని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న అందరిపైనా వారం రోజుల్లో కోర్టులో కేసు వేయనున్నామన్నారు. టీటీడీ ఈవో చాలెంజ్ చేశారు. పార్వేటీ మండపం వద్ద చర్చకు రమ్మంటూ టీటీడీ ఈవో ఛాలెంజ్ చేశారు కాబట్టే వచ్చామని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఈవో రాజకీయ నాయకుడిలా ఛాలెంజులు విసరటం మంచిది కాదన్నారు.