సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో పెంచుకున్న నమ్మకాన్ని ఆర్టీసీ కోల్పోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాపోయారు. సీఎం జగన్ ప్రజారవాణా వ్యవస్థను అన్నివిధాలా నాశనం చేశారని విమర్శించారు.ఆర్టీసీ దుస్థితికి విజయవాడ ప్రమాదం ఒక ఉదాహరణ మాత్రమేనని, ఆర్టీసీ బస్సెక్కితే క్షేమంగా గమ్యం చేరతామన్న నమ్మకం పోయిందన్నారు. 2 వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు.జగన్ ప్రభుత్వం అనాలోచిత, దుర్మార్గమైన విధానాలతో ఆర్టీసీ నష్టపోతోందని దుయ్యబట్టారు. జగన్ పిచ్చి చేష్టలతో రూ. 4 వేల కోట్లు కేంద్రం నిధులు ఆగిపోయాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.