ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 22కు వాయిదా పడిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 01:58 PM

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటీషన్‌పై విచారణను హైకోర్టు  ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని ఏజీ.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com