వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల పాలనలో మొత్తం రూ.33,209.81 కోట్లు రైతులకు సాయంగా అందించామన్నారు. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని సీఎం వైయస్ జగన్ ప్రశ్నించారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైయస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు.