పురందేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు తగవని బిజెపి జిల్లా అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల క్రితం రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తుంటే దానిని తట్టుకోలేని నేతలుఅనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.