న్యాయ వ్యవస్థపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని టీడీపీ కీలక నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజల తరఫున పోరాడుతున్న వారిపై దొంగ కేసులు పెడుతున్నారు.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరాం.. దక్షిణ భారతదేశ బీహార్‌గా ఆంధ్రప్రదేశ్ మారింది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.