డబ్బులు అందుకున్న తర్వాత ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ముసాయిదా నివేదిక రూపొందించేందుకు జరగాల్సిన లోక్ సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సభ ఈ నెల 9కి వాయిదా పడింది. వాయిదాకు కారణం అధికారికంగా వెల్లడించలేదు.