పంజాబ్ రాష్ట్రంలో రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలను తగులబెట్టడం పరిపాటిగా మారింది. అయితే ఈ పంట వ్యర్థాల కాల్చివేత ఢిల్లీకి శాపంగా మారింది. కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరగడంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.