ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టులో పిటిషన్.. విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ పీకే మిశ్రా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 06:29 PM

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని సిటిజెన్స్‌ ఫర్‌ డెమొక్రసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా వైదొలిగారు. విచారణ నుంచి జస్టిస్‌ మిశ్రా వైదొలగడంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కేసును మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఉత్తర్వులు జారీచేశారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ార ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అందుకే ఈ పిటిషన్‌ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నమోదులో ప్రభుత్వం యథేచ్ఛగా జోక్యం చేసుకుంటోందంటూ సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేస్తున్నట్లు ప్రధానంగా ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్ మరో ధర్మాసనం ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో పాటూ పలువురు మాజీ అధికారులు కలిసి సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ సుప్రీం కోర్టులో ఓటర్ల జాబితాపై పిల్ దాఖలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com