పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు బుధవారం అమరావతి గ్రామంలో పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు హాజరై గ్రామ అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం అమరావతి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు. తదుపరి ఎస్సీ కాలనీలో వైయస్సార్సీపీ కార్యకర్త కమ్మంపాటి భూషణం అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.