గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ పీహెచ్సీల్లో ఖాళీలను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు డీఎంహెచ్వో శ్రావణబాబు మంగళవారం తెలిపారు. మొత్తం 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తిగలవారు ఈ నెల 10న ధ్రువపత్రాలు తీసుకుని తమ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు.