శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగిలో సచివాలయాన్ని బుధవారం పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సచివాలయం వ్యవస్థను సీఎం జగనన్న తీసుకువచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి శివశంకర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.