గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను రామచంద్రాపురం మండలంలో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం మండలంలోని సి. రామాపురం పంచాయతీ పరిధిలోని కోదండరామాపురం, హరిజనవాడ, రామచంద్రాపురం, రామాపురం, గిరిజన కాలనీల్లో గడప గడపకు వెళ్లిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెంట మండల వైసిపి నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు.