దేశంలోని మొబైల్ యూజర్ల కోసం కేంద్రం ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను త్వరలో ప్రారంభించనుంది. సిమ్ కార్డుల మోసాలను అడ్డుకునేందుకే ఈ ప్రతిపాదన తెనున్నట్లు పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ మాదిరి మొబైల్ యూజర్లకు ఈ ప్రత్యేక సంఖ్య కేటాయించనుంది. యూజర్ల మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన వివరాలను ఈ ఐడీతో జత చేస్తారు. యజర్ పేరిట రిజిస్టర్ అయిన సిమ్‌కార్డులు, యాక్టివ్ సిమ్‌ల వివరాలను అనుసంధానిస్తారు.