నాగలాపురంలో అర్హులైన పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చేంతవరకు పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సుందరయ్య కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.