యాడికి మండలంలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన 7వ తరగతి విద్యార్థి అజయ్ కుమార్ 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు.