వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కావడంతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకదాటిగా ఐదేళ్లు రైతులకు రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గిరిజమ్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.