రాష్ట్ర మంత్రి ఉషాశ్రీ చరణ్ ప్రత్యేక చొరవతో కుందుర్పి మండలం కేంద్రంలో తిమ్మప్పస్వామి దేవాలయ నిర్మాణం కొరకు దాదాపు రూ. 10లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన మంత్రికి దళిత కాలనీవాసులు, గ్రామ సర్పంచ్, వైయస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం దేవాలయ పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి, ఆలయ ధర్మకర్త పాల్గొన్నారు.