నంబులపూలకుంట మండలం వెలిచెలమల గ్రామ సచివాలయం నూతన భవనాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల ద్వారానే గ్రామ స్వరాజ్యం తీసుకురావచ్చు అని దృఢంగా నమ్మిన వ్యక్తి అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన కొనసాగుతున్నదన్నారు.