'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని మండలంలో 100 శాతం పూర్తి చేయాలని చిన్నగంజాం మండలం ప్రత్యేక అధికారి, ప్రకాశం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సిహెచ్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన చినగంజాం లో హౌసింగ్ పథకాలు ఏ విధంగా అమలవుతున్నవీ సమీక్షించారు. ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి లబ్ధిదారుడి చేత గృహాలు కట్టించే బాధ్యతను హౌసింగ్ సిబ్బంది తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.