దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు ఉపయోగించాల్సిన యాప్ను పురుషుల ఫోన్లలో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బుధవారం ‘ఎక్స్’లో ఆయన వివిధ అంశాలపై వ్యాఖ్యానించారు. ‘‘ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగులపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణం అని లోకేశ్ ధ్వజమెత్తారు.