జగన హామీలన్ని ఉత్తరకుమార ప్రగల్భాలేనని జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ విమర్శించారు. అన్నదాతలకు ఏమి లబ్ధి చేకూర్చారని రైతు భరోసా సభ నిర్వహించారో అర్థం కావడం లేదని బుధవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఎద్దేవా చేశారు. పగటిపూట నాణ్యమైన 9 గంటల నిరంతర విద్యుత ఇస్తున్నారా..? ఉద్యానవన రైతులను ఆదుకున్నారా..? సబ్సిడీపై స్ర్పింక్లర్లు, డ్రిప్పులు మంజూరు చేశారా..? తీవ్ర వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతన్నకు నష్టపరిహారం చెల్లించారా..? కౌలు రైతులను ఆదుకున్నారా..? అని ప్రశ్నించారు. కేవలం రైతులను ఓటు బ్యాంకుగా చూస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.