విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం న్యాయాధికారి బుధవారం తీర్పు చె ప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు లో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందించిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కోట్ని ప్రేమ్‌కుమార్ తన రైస్‌మిల్లుకు విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి అడిషనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.మధుసూదనరావు 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశా రు. ప్రేమ్‌కుమార్ నుంచి మధుసూదనరావు లంచం తీసుకుంటుండ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో న్యాయాధికారి జైలు శిక్ష, జరిమానా విధి స్తూ తీర్పు చెప్పారు. నిందితుడు మధుసూదనరావు ప్రస్తుతం ఏలూరులో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.