ఒకసారి మినహాయింపు పేరుతో అడ్డదారులు ఏర్పాటు చేశారని విమర్శించారు. అవగాహన లేని అధికారులతో విద్యాశాఖను రాష్ట్ర ప్రభుత్వం నింపాలనుకుంటున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... డీఈఓ, డీడీ పోస్ట్‌లు నింపటానికి ప్రమోషన్ పద్ధతి ఉందన్నారు. ఈ జీవోలో సడలింపులే ఎక్కువ అని.. రిజర్వేషన్ తుంగలో తొక్కి అన్యాయం చేస్తూన్నారని వ్యాఖ్యలు చేశారు. అర్హులు లేనపుడు క్యారీఫార్వర్డ్ కావల్సిన ఫోస్టు ఎలా భర్తి చేస్తారని ప్రశ్నించారు. పాఠశాలలో ఒక్కరోజు పని చేయని వారితో ఏ విధంగా పాఠశాలలపై పెత్తనం చేయిస్తారని నిలదీశారు. సర్వీస్ రూల్స్ లేవని అడ్డదారులు వెతుకుతున్నారన్నారు. ఇప్పటికే పాఠశాల విద్య ప్రయోగాల పేరుతో పాడైందని.. ఈ జీవో పాఠశాలలపై పెత్తనాన ప్రయత్నమే అంటూ జవహర్ విరుచుకుపడ్డారు.