స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ నెల 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.