ఏపీ ప్రభుత్వం డీకే పట్టాపై యాజమాన్య హక్కుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. డీకే పట్టాలు జారీ చేసి పదేళ్లు దాటిన తర్వాతే వాటిని నిషేధిత జాబితా (22ఏ) నుంచి తొలగించాలని జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించింది. నిషేధిత జాబితా నుంచి తొలగించే డీకే పట్టాల లబ్ధిదారుల వివరాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 5న ప్రకటించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్డీఓ, జేసీ, కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది.