పార్లమెంటు ఎథిక్స్ కమిటీపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పించారు. తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘ఎథిక్స్ కమిటీ ద్వారా అనైతికంగా బహిష్కరించబడిన తొలి నేతగా పార్లమెంటు చరిత్రలో నిలవనున్నందుకు గర్వంగా ఉంది. మొదట బహిష్కరించి ఆ తర్వాత ఆధారాలు సేకరించాలని సీబీఐని అడగండి. ఇది ప్రారంభం నుంచి చివరి వరకు కంగారూ కోర్టు, కోతుల వ్యాపారం అయిపోయింది’’అని పోస్ట్ చేశారు.