చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి మంజుల అన్నారు. గురువారం గుంతకల్లు పట్టణంలోని మొదినాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా మహిళలు వరకట్న వేధింపులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రామ సుబ్బయ్య, న్యాయవాదులు కృష్ణారెడ్డి, నాగశేషు తదితరులు పాల్గొన్నారు.