బత్తలపల్లి మండలంలోని డి. చెర్లోపల్లికి చెందిన 9 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు గురువారం తెలిపారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేస్తుండగా అడ్డుకుని గుత్తేదారు రాజశేఖర్ ను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టీడీపీ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, రవి, శివశంకర్ నాయుడుతో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు అయినట్లు తెలిపారు.