జిల్లాలో కరువు బారిన పడిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ అలసత్వాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ అనుబంధ ఏపి రైతు సంఘం నాయకులు గురువారం గుంతకల్లు మండల పరిధిలోని వైటి చెరువు గ్రామంలోని సచివాలయం వద్ద అంబలి తాగి నిరసన వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, రామురాయల్ తదితరులు పాల్గొన్నారు.