ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల సునీత ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం గురువారం చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం పథకం, నిరుద్యోగ భృతి గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.