అనకాపల్లి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు జనం పోటెత్తారు. అటు ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న జనం, సభాస్థలికి చేరుకోగానే జనసంద్రాన్ని తలపించారు. జై జగన్ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. అత్యంత ఉత్సాహంగా జనం...సభ ఆసాంతం కదలకుండా నిలుచున్నారు. గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని.. కానీ, సీఎం వైయస్ జగన్ పాలనలో ఆయా వర్గాలకు పెద్ద పీట వేశారని వైయస్ఆర్సీపీ కీలక నేతలు చెబుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా.. గురువారం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు.