బడుగు బలహీవర్గాలకు సుమారు లక్ష 50 కోట్ల రూపాయల్ని వాళ్ల వాళ్ల ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఈ ప్రభుత్వం. సీఎం వైయస్ జగన్ విజనరీ నాయకుడు. సచివాలయం.. వలంటీర్ వ్యవస్థల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని ఎంపీ సత్యవతి అన్నారు. ఆమె మాట్లాడుతూ... 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవాళ్ల జీవితాలకు అండగా నిలిచారు. తండ్రి బాటలోనే పయనిస్తూ పాలన చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో సీఎం వైయస్ జగన్ ఉన్నారని తెలిపారు. సాధికార బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ సత్యవతి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డిటి ప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, అదీప్ రాజు, ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు.